కావలసిన పదార్థాలు : కోడిగ్రుడ్లు... ఆరు ఉల్లిపాయలు... రెండు పచ్చిమిర్చి... నాలుగు పసుపు... అర టీ. నూనె... తగినంత ఉప్పు... సరిపడా
తయారీ విధానం : పాన్లో నూనె వేసి వేడయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పులను వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్నంతటినీ ఓ వెడల్పాటి మరో పాన్లో వేసి సమంగా సర్దాలి. దీనిపై ఒక్కో గుడ్డును పగులగొట్టి ఎల్లో కనిపించేలా పోయాలి. తరువాత ఆ పాన్పై మూతపెట్టి సిమ్లో ఉడికించాలి. అంతే ఎగ్ ఆనియన్ చిల్లీ ఫ్రై రెడీ అయినట్లే..! తినడానికే కాదు, చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉండే దీన్ని తయారు చేసేందుకు సిద్ధమేనా మరి...!!