కావలసిన పదార్థాలు : బ్రెడ్... ఒక పాకెట్ ఉల్లిపాయలు... రెండు ఉప్పు... తగినంత కారప్పూస... అర కప్పు కొత్తిమీర... సగం కట్ట ఛీజ్... అర కప్పు టమోటోలు.. రెండు మరమరాలు... అర కప్పు చిల్లీ పౌడర్... అర టీ. చింతపండు చట్నీ... అర కప్పు
తయారీ విధానం : బ్రెడ్ స్లైసెస్‌ను కట్ చేసి, వాటిని తడిపి గుండ్రంగా చుట్టాలి. వీటిని పాన్ మీద ఛీజ్ రాస్తూ ఎర్రగా కాల్చాలి. ఉల్లిపాయలు, టమోటోలు, ఉప్పు, మరమరాలు, కారప్పూస, చిల్లీపౌడర్‌లను ఒక పాత్రలో కలిపి పైన తురిమిన కొత్తిమీర, చింతపండు చట్నీ వేయాలి.
వేయించి ఉంచుకున్న బ్రెడ్ స్టిక్స్‌తో పాటు, పై మిశ్రమాన్ని కలిపి సర్వ్ చేయాలి. అంతే కమ్మనైన ఛీజ్ బ్రెడ్ స్టిక్స్ తయారైనట్లే...! చైనీయులు చాలా ఇష్టంగా తినే ఈ వంటకం పిల్లలతో పాటు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి మరి..!!