ఈవెనింగ్ స్నాక్స్ "గ్రీన్‌పీస్ కట్‌లెట్స్"

FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బంగాళాదుంపలు.. మూడు
బ్రెడ్ ముక్కలు.. ఒక కప్పు
ఉడికించిన పచ్చిబఠాణీలు.. అర కప్పు
ఆవాలు.. ఒక టీ.
కరివేపాకు.. రెండు రెబ్బలు
పసుపు.. ఒక టీ.
ధనియాలపొడి.. రెండు టీ.
ఉప్పు.. తగినంత
కొబ్బరితురుము.. కాస్తంత
నూనె.. సరిపడా
కొత్తిమీర తరుగు.. కొద్దిగా

తయారీ విధానం :
బంగాళాదుంప ముక్కల్ని మెత్తగా చేసి బ్రెడ్ ముక్కలు, ఉప్పు వేసి కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ నూనె వేడిచేసి పైన చెప్పుకున్న మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలుపుతూ ఐదు నిమిషాలు వేయించి దించేయాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దను కొద్దిగా తీసుకుని గుండ్రంగా చేసి.. అందులో వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేయాలి.

అలా మొత్తం చేసుకున్న తరువాత ఒక ట్రేల్ వరుసగా సర్ది, మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి వేయించి తీసేయాలి. అంతే గ్రీన్‌పీస్ కట్‌లెట్స్ సిద్ధమైనట్లే..! ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే టొమోటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి