కావలసిన పదార్థాలు : కార్న్‌ఫ్లోర్... పది టీ. మైదాపిండి... 300 గ్రా. కోడిగుడ్లు... రెండు (తెల్లసొన) ఉప్పు... సరిపడా నూనె... తగినంత
కూర కోసం... క్యారెట్, బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర తురుము... తలా రెండు కప్పులు సోయా, చిల్లీ సాస్‌లు... చెరో నాలుగు టీ. అజినమోటో... అర టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : ఒక పాత్రలో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి కలపాలి. ఇందులోనే తగినన్ని నీళ్లు కలిపి చపాతీ ముద్దలా కలపాలి. ఈ ముద్దను చపాతీల్లా ఒత్తి 5 అంగుళాల పొడవు 5 అంగుళాల వెడల్పు ముక్కలుగా కోసి ఉంచాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి క్యారెట్, బీన్స్, క్యాబేజీ, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. ఆపై అజినమోటో, సాస్‌లు, ఉప్పు వేసి కూరలా చేయాలి. ఈ కూరను ఒక్కో టీస్పూను చొప్పున చపాతీ ముక్కల్లో పెట్టి దాన్ని త్రికోణాకారంలో సగానికి మడిచి, కూర బయటకు రాకుండా కోడిగుడ్డు సొనతో అంటించాలి. ఇప్పుడు మళ్లీ త్రికోణానికి అడుగు భాగంలో రెండు అంచులనూ అంటిస్తే పడవ ఆకారం వస్తుంది. ఇలా చేసిన పడవల్ని నూనెలో వేయించి తీయాలి.