కావలసిన పదార్థాలు : పెద్దసైజు రొయ్యలు... పది వెనిగర్... ఒక టీ. గుడ్లు... రెండు అల్లం, ఉల్లిరసం... రెండు టీ. బ్రెడ్ ముక్కలు... ఒక కప్పు ఉప్పు... సరిపడా నూనె... తగినంత
తయారీ విధానం : రొయ్యలను శుభ్రం చేసి వెనిగర్, ఉప్పు, ఉల్లి, అల్లం రసంతో కలుపుకోవాలి. కాసేపు అలాగే ఉంచి.. చెక్క గరిటెతో రొయ్యలను సాపుజేసి, బీట్ చేసిన గుడ్ల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిలో దొర్లించాలి. ఇలా మొత్తం రొయ్యలన్నింటినీ చేసి ఓ పాన్‌లో సర్ది... మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే ప్రాన్ కట్లెట్స్ సిద్ధమయినట్లే..! వీటిని కొత్తిమీర చట్నీ లేదా టొమోటో సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.