కావలసిన పదార్థాలు : క్యారెట్ తురుము... అర కప్పు బీన్స్ ముక్కలు... అర కప్పు క్యాబేజీ తురుము... ముప్పావు కప్పు అల్లం వెల్లుల్లి... అర టీ. చిల్లీసాస్... అర టీ. అజినమోటో... కొద్దిగా మిరియాలపొడి... కాస్తంత కోడిగుడ్డు... ఒకటి (తెల్లసొన మాత్రమే) కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ. మైదా... నాలుగు టీ. జీడిపప్పు... 50 గ్రా. ఉప్పు... తగినంత నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : సన్నగా తరిగిన కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలో వేసి కలపాలి. అందులోనే మిగిలిన దినుసులన్నీ కూడా వేసి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే పకోడీల పిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరవాత కూరగాయల మిశ్రమాన్ని గుండ్రటి ముద్దలుగా చేసి వేసి, ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.