వెజిటబుల్ పిజ్జా

కావలసిన పదార్థాలు :
రెడీమేడ్‌ పిజ్జా బేస్ పెద్దది... ఒకటి
వెన్న... 50 గ్రా.
ఛీజ్ పేస్టు... 50 గ్రా.
ఛీజ్‌ తురుము... 50 గ్రా.
టొమాటో సాస్... 50గ్రా.
కొత్తిమీర తురుము.. ఒక టీ.
టొమాటో ముక్కలు... 4
క్యాప్సికమ్‌ ముక్కలు... 4
క్యారెట్‌ ముక్కలు... 4
పచ్చిమిర్చి తురుము... ఒక టీ.
మిరియాల పొడి... పావు టీ.
ఉప్పు... పావు టీ.

తయారీ విధానం :
ఒక పాత్రలో వెన్న వేసి అందులో ఛీజ్‌ పేస్టు, సగం టొమాటో సాస్‌, చిటికెడు ఉప్పు, పచ్చిమిర్చి తురుము వేసి స్పూనుతో బాగా గిలకొట్టి పిజ్జామీద రాయాలి. తరవాత కొత్తిమీర తురుమును పిజ్జామీద ప్లస్‌మార్కులా వేయాలి. ఇప్పుడు పిజ్జా నాలుగు భాగాలుగా కనిపిస్తుంది. ఒక్కో భాగంలో ఒక్కో టొమాటో, క్యారెట్‌, క్యాప్సికమ్‌ ముక్కల్ని పేర్చి, వాటిపై మిరియాల పొడి చల్లాలి.

దాని పైనే ఛీజ్‌ తురుమును కూడా పలుచగా చల్లాలి. మధ్యమధ్యలో టొమాటో సాస్‌ను వేసుకోవాలి. దీనిమీద మళ్లీ కొద్దిగా కొత్తిమీర తురుమును ఉంచాలి. ఇప్పుడు పిజ్జాను ఇలాగే తీసుకెళ్లి ఓవెన్‌లో ఓ నిమిషం వేడిచేసి తీసి, చాకుతో నాలుగు భాగాలుగా కోసి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి