చీకటి నుంచి వెలుగుకు మరణం నుంచి బతుకుకు విషాదం నుంచి మోదానికి
ప్రతీక - ఈస్టర్ సండే
క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండుగల్లో ఈస్టర్ ఒకటి. ఆరోజు క్రైస్తవులకు మహా పర్వదినం. ఆనందించదగ్గ సుదినం. ఎందుకంటే - గుడ్‌ఫ్రైడే నాడు శిలువవేయబడ్డ ఏసుక్ర్తీసు తిరిగి జన్మించింది ఈరోజే కనుక!
WD
బైబిల్ ప్రకారం - గుడ్‌ఫ్రైడే నాడు జెరూసలెంలో ఏసుక్ర్తీసును శిలువ వేయడం జరిగింది. తాను దేవునిబిడ్డగా ప్రచారం చేసుకుంటున్నాడని చక్రవర్తికి పన్నులు కట్టాల్సిన పనిలేదని ప్రజలకు నూరిపోస్తున్నాడని - ఇలా వివిధ ఆరోపణలతో ఏసుక్రీస్తును యూదులు శిలువ వేశారు. తలపై ముళ్ల కంపలతో, కొరడాదెబ్బలతో ఆయన శరీరం రక్తసిక్తమైంది. శిలువపై ఆయన్ని మేకులతో కొట్టడంతో తుదిశ్వాస విడిచాడు. గుడ్‌ఫ్రైడే నాడు ్యమధాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసు మరణించడంతో శిలువ నుంచి ఏసుక్రీస్తు శవాన్ని జోసెఫ్ అనే వ్యక్తి కిందకు దించాడు.
ఆ మృతదేహాన్ని ఓ సన్నని షీట్లో భద్రపరిచి సమాధి చేశాడు. అయితే ఆ సమాధిలో ఏసు మృతదేహంపై ఎలాంటి సుగంధ ద్రవ్యాల్ని వేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గలిలీ నుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు గమనించారు. దాంతో వారు ఇంటికి వెళ్లి కొన్ని సుగంధద్రవ్యాల్ని, పెరఫ్్యూమ్‌లను తయారుచేశారు. ఆ మర్నాడు సబ్బతో (శనివారం) కాబట్టి వారు విశ్రాంతి తీసుకున్నారు. (యూదు చట్టం ప్రకారం) ఆదివారం ఉదయం పొద్దున్నే - ఆ స్త్రీలు సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాల్ని తీసుకు వెళ్లారు.
అక్కడ వారు చూసిన దృశ్యం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సమాధి పక్కనే ఉన్న ఒకరాయి పక్కకు దొర్లినట్లు కనిపించింది. లోపల ఏసు మృతదేహం లేకపోవడం ఇంకా ఆశ్చర్యం. ఒక్కసారిగా మెరిసిపోయే ధవళ వస్త్రాలలో ఇద్దరు ఆ స్త్రీల చుట్టూ ఉండడం కనిపించింది. వారెవరో కాదు దేవతలు...
సమాధి నుంచి బయటకు వచ్చి - బతికి ఉన్న వ్యక్తి కోసం ఎందుకు సమాధిలో ఇంకా వెతుక్కుంటారు. వ్యర్ధంగా అని ఆ దేవతలు ఆ స్త్రీలను ప్రశ్నించారు. ఆ స్త్రీల ఆనందానికి అంతులేదు. గబగబ ఇళ్లకు వెళ్లారు. అందరికీ ఈ ఆనందకర వార్తను చెప్పారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ పాకిపోయింది. దేవుని బిడ్డ తిరిగి బతకడంతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతాడని భావించి వారి ఆనందానికి అవధుల్లేవు, పట్టపగ్గాల్లేవు. ఆదివారంనాడు ఏసుప్రభువు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఆ రోజు వారు ఈస్టర్ పండగ జరుపుకున్నారు. ఈస్టర్ అనే పదం పుట్టుక చాలా మందికి తెలీదు. ఆంగ్లో-స్క్సాన్ ట్యుటోనిక్‌లో శరదృతువుకు, ఫలత్వానికి దేవతకు - ఈస్టర్ అనే పదంతో సంబంధం ఉన్నట్లు చెబుతారు. ఈ దేవతను పూజించేందుకు ఏప్రిల్ మాస్నాని అంకితం చేశారు.
ఈస్టర్కు గల మరో పేరు - పాస్ట్. ఈ పదం - యూదుల పండుగ అయిన పేసో పండగ కు చెందిందని చెబుతారు.
నిజానికి చాలా లక్షల సంవత్సరాల కిందట క్రైస్తవుల్లో చాలా మంది యూదు వంశానికి చెందిన వారు. వారు ఈస్టర్ను కొత్త అనుభూతిగా ఆహ్వానించారు. ఈస్టర్ వారంలో అనేక ఉత్సవాలు జరుపుకోవడం రివాజు. వసంత రుతువును ఆహ్వానిస్తూ సూర్యోదయపు తొలికిరణాల్ని స్వాగతించడం ఓ ఉత్సవం. బాప్టిస్టులకు ఈస్టర్ రాత్రి ఓ మధురానుభూతి బ్టాపిజం తీసుకునే కొత్తవారు - మరణానికి చిహ్నమైన రాత్రి చీకట్లను పారదోలడం ప్రముఖంగా సాగే చర్చ. రాత్రివేళ జరిగే ఈ ఉత్సవం - నూతన జీవిత్నాని పొందేందుకు వెలుగును ప్రసాదించడం విశేషం. దీనికి గుర్తుగా వారు ఆ చీకటి వేళ కొవ్వోత్తుల్ని వెలిగిస్తారు. దీన్ని నైట్ ఆఫ్ ఇల్యుమినేషన్ అని పిలుస్తారు. కొవ్వొత్తుల్ని వెలిగించే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ ఉత్సవం నుంచే!
ఈస్టర్ ఆదివారంనాడు - క్రైస్తవులు చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఈస్టర్ నాడు - క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించుకుని వాటిని చేతబట్టుకుని నగరమంతా పర్యటిస్తారు. దీన్ని ఈస్టర్ పెరేడ్ అంటారు. ఈ ఉత్సవం కూడా కొత్తగా బాప్టిజం తీసుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళేవారి కోసం ఏర్పాటైనది. కొత్త బట్టలు కట్టుకుని, క్రైస్తవ సోదరులందరి ఇళ్లకూ వెళ్లి బహుమతులు పంచుకోవడం జరుగుతుంది.
అంతేకాదు - ఈస్టర్ రోజున క్రైస్తవ సోదరులు అందంగా అలంకరించిన కోడిగుడ్లను పరస్పరం పంచుకుంటారు. ఈ కోడిగుడ్డు - నూతన జీవితానికి హ్నం. పై నున్న బలమైన పెంకును దూసుకుని బయటకు జీవి వ్చనట్లు - పునర్జన్మకు ఇది సంకేతం. గుడ్‌ఫ్రైడే నాడు సమాధి కాబడిన ఏసుప్రభువు - ఈస్టర్ సండేనాడు సమాధి నుంచి బయటకు వచ్చాడు. కోడిగుడ్డు లోంచి కోడిపిల్ల బయటకు వచ్చినట్లుగా జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా - ఈస్టర్‌నాడు క్రైస్తవులు కోడిగుడ్లను పంచుకోవడం జరుగుతుంది. ఈస్టర్ నాటి కుందేలుకు కూడా ప్రాధాన్యం ఉంది. ఇది ఫలదీకరణకు, ఫలవంతానికి ప్రతీక. ఇది వసంత రుతువును ప్రతిబింబిస్తుంది.
క్రీస్తు జన్మించిన పవిత్ర ప్రదేశం... బెత్లహామ్!
ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంకు దక్షిణాన సుమారు ఆరు మైళ్ళ దూరంలో ఉంది... బెత్లహామ్. డెడ్సీని ఆనుకుని ఉన్న జుడియా ప్రాంతపు ఉత్తరభాగంలో ఉందీ పట్టణం. పచ్చని ప్రకృతి, నింగిని తాకుతూ పర్వతాలు, కాంతులీనుతూ పొడువాటి చర్చిలు, ఆ చర్చిల్లో మారుమోగుతున్న గంటలు... ఇలా బెత్లహామ్ పట్టణం అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. డిసెంబర్ నెలలో గుండె ఘనీభవిస్తున్నంతగా చలిగాలులు...
WD
స్నేహభావానికి సంకేతంగా నింగి నుండి జాలువారి పృధ్విని సుతారంగా తాకుతూన్న మంచు బిందువులు... నిష్కల్మష హృదయాలకు ప్రతీకగా చెంగుచెంగున గెంతే గొర్రెపిల్లలు... దయాపూర్ణ రాగాలకు రసధునులను అందిస్తూ కదిలే ఆలివ్ చెట్ల గుబురులు... ఇలా బెత్లహామ్ వాతావరణమంతా... క్రిస్మస్కు స్వాగతం పలికేందుకు సమాయత్తమవుతుంది.
పవిత్ర గుహ ప్రాంతంలో... బెత్లహామ్ నగరానికి సరిగ్గా నడిబొడ్డున మాంగర్ స్ట్రీట్ ఉంది. పెద్ద పెద్ద భవంతులతో, అందమైన చర్చిలతో ఈ వీధి శోభాయమానంగా కనిపిస్తుంది. ఆ వీధిలో అలా... అలా...ముందుకు కదిలినప్పుడు మాంగర్స్క్వేర్ దర్శనమిస్తుంది. విద్యుద్దీపాల కాంతితో అందంగా అలరారే పెద్ద భవంతి ఇది. దీని తరవాత గ్రొట్టో ఆఫ్ నేటివిటీ కనిపిస్తుంది. జీసస్ జన్మించిందీ గుహ ప్రాంతంలోనే! ఇక్కడ 12వ శతాబ్దానికి చెందిన దైవపీఠం ఒకటి ఉంది. దేవతలకు ముఖ్యంగా మేరీమాతకు సమర్పించే కానుకలను ఉంచే ఈ పీఠం మీద వెండితో తయారై... ధగధగ మెరుస్తూ ఉన్న నక్షత్రమొక్కటి దర్శనమిస్తుంది. ఆ నక్షత్రం మీద లాటిన్లో- హిక్ డీ వర్జిన్ మరియా జీసస్ క్రిస్ట్మస్ నేటస్ ఎస్ట్ (పవిత్ర మేరీమాతకు బిడ్డగా క్రీస్తు జన్మించింది ఈ ప్రాంతంలోనే) అని అందంగా లిఖితమై ఉంటుంది. దీని తరువాత క్రైస్తవ పూజా మందిరం కనిపిస్తుంది.
మేరీమాత తన శిశువు జీసస్‌ను పడుకోబెట్టిందీ మందిరంలోనే! క్రీస్తు జననానికి సంబంధించిన చిత్రపటాలను కలిగిన అరుదైన గుహ ఇది! సర్వాంగసుందరంగా... కొవ్వొత్తుల కాంతులతో మెరిసే ఈ గుహ చూపరుల హృదయాలను ఇట్టే హత్తుకుంటుంది. ఈ గ్రొట్టో ఆఫ్ నేటివిటీకి పైప్రాంతంలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అందమైన చర్చి ఒకటి కనువిందు చేస్తుంది. అదే చర్చ్ ఆఫ్ నేటివిటీ విశాలమైన భవనం, ప్రశాంతతకు అలవాలమైన ప్రార్థనా ప్రదేశం, ఎత్తయిన గోపురం, దాని లోపల భారీ గంట... మొదలయిన వాటితో సుమనోహరంగా ఉంటుందీ చర్చి.
ఈ చర్చ్‌కు 1600 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రైస్తవ మత సిద్ధాంతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అత్యంత ప్రాచీనమైన చర్చి కూడా ఇదే! క్రీ.శ.330 సంవత్సరంలో హెలీనా దీన్ని నిర్మించింది. మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి కానస్్టాంటిన్ తల్లే హెలీనా! క్రీస్తు, ఆయన ముఖ్య సహచరులు బోధించిన సువార్తలయిన గోస్పెల్లలో ప్రస్తావించిన ప్రదేశాలను కనుగొనే నిమిత్తం... కానస్్టాంటిన్ తన తల్లి హెలీనాను పంపాడు. ఆమె ఆ సందర్శనలో అనేక ప్రదేశాలను కనుగొంది. క్రీస్తుకు సంబంధించిన శిలువలు, శిథిలాలను సైతం... ఆమె చాలా ప్రాంతాలలో కనుగొంది. ఈ సందర్భంగా హెలీనా ఒక గుహను కొనుగొనడం జరిగింది.
అదే క్రీస్తు జన్మించిన స్థలమయిన గ్రొట్టె ఆఫ్ నేటివిటీ! జీసస్ గుహలో జన్మించాడని గోస్పెల్లలో కచ్చితంగా పేర్కొనకపోయినా ఈ గ్రొట్టో ఆఫ్ నేటివిటీలోనే జీసస్ జన్మించినట్లు స్థానికులు చాలా ప్రాచీనకాలంనుంచి నమ్ముతూ వస్తున్నారు. ఈ గుహపైన కానస్్టాంటిన్ సహాయంతో హెలీనా నిర్మించినదే చర్చ్ ఆఫ్ నేటివిటీ!
కాంతులీనే చర్చ్ ఆఫ్ నేటివిటీ! అయితే క్రీ.శ.550లో ఇజ్రాయిల్‌ను పరిపాలించిన జస్టినియన్ చక్రవర్తి- చర్చ్ ఆఫ్ నేటివిటీకి మరిన్ని మెరుగులు దిద్దాడు. అప్పటికే ఉన్న చర్చిని పూర్తిగా కూలగొట్టక పోయినా చాలా వరకు మార్పులు, చేర్పులు చేశాడు. ప్రస్తుతం ఉన్న చర్చి జస్టినియన్ నిర్మించినదే! ఈ నూతన నిర్మాణం కింద పాత చర్చి ఆనవాళ్ళు నేటికి కూడా కనిపిస్తాయి.
WD
ఈ చర్చి ముఖమంటపం రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకృతమై దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుంది. లోపలంతా చల్లగా, మసక మసకగా, విశాలంగా గులాబీ వర్ణపు గుమ్మటాలతో అందంగా కనిపిస్తుంది. చుట్టూరా వివిధ భంగిమలలో ఉండే విగ్రహాలు... చీకటిని చీల్చుకుంటూ కొవ్వొత్తుల వెలుగు రేఖలు... వింత అనుభూతిని అందిస్తాయి. చర్చికి బయట శాంతి సూచకమైన ఆలివ్ చెట్ల కొమ్మలతో, రెమ్మలతో తయారైన వస్తువులను అమ్ముతూ వ్యాపారులు దర్శనమిస్తారు. క్రిస్మస్ దృశ్యాలను, క్రీస్తు చరిత్రను ప్రతిబింబిస్తున్న ఫోటోలను అమ్ముతూ అనేక షాపులు బారులు తీరి నిలబడతాయి.
ధవళ కాంతితో... ఈ మాగర్ స్ట్రీట్‌లో చర్చ్ ఆఫ్ నేటివిటీకి పక్కపక్కనే అనేక చర్చిలున్నాయి. ప్రభువు ప్రకటించిన శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ చర్చిలలో ప్రముఖమైంది సెయింట్ కాథరిన్ చర్చి. ఇక్కడ జరిగే క్రిస్మస్ నాటి అర్థరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆనాటి రాత్రి రంగురంగుల వ్యిదుద్దీపాలతో, క్రిస్మస్ చెట్లతో... కొవ్వొత్తులతో బారులు తీరిన బాలబాలికలతో శాంతాక్లాజ్ తాతయ్యతో ఈ చర్చి ప్రాంతమంతా సందడి సందడిగా ఉంటుంది. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడ అర్థరాత్రి ప్రార్థనలు చ్తేసారు. కరుణామయుణ్ణి ప్రస్తుతిస్తూ గీతాలాపన చేస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడి ఆనందం కోసం మేము ప్రార్థిస్తున్నాం. అందరి సుఖశాంతుల కోసం ప్రభువుని అర్థిస్తున్నాం. ప్రేమ, కరుణ మొదలైన ఉత్తమ గుణాలు ప్రతి హృదయంలోనూ ్థసిరపడాలి అంటూ ప్రార్థనలు చేస్తారు.
మాంగర్ స్ట్రీట్‌లోని గ్రొట్టో ఆఫ నేటివిటీలోని కొవ్వొత్తుల కాంతి రేఖలు... అక్కడి చర్చిల పవిత్రతలను తెలుసుకున్న తరవాత... మరి కాస్త ముందుకు నడిస్తే మిల్క్ గ్రొట్టో స్ట్రీట్‌లోకి అడుగుపెడతాం. ఆ వీధిలోని మిల్క్ గ్రొట్టో చర్చ్ శ్వేతవర్ణంలో తళతళ మెరుస్తూ కనిపిస్తుంది. ఈ చర్చ్ పాలులాగా తెల్లగా ఉండడం కారణంగానే ఈ చర్చికా పేరువచ్చింది. దీనికి ఒక చారిత్రక కథ కూడా ఉంది. మేరీమాత తన శిశువు జీసస్కు పాలిస్తున్నప్పుడు- చనుబాలలోని కొన్ని చుక్కలు ఇక్కడి నేలమీద పడ్డాయట! దీంతో ఈ నేలంతా ధవళకాంతిని పరుచుకుంది అని ప్రసిద్ధి. దీనిని దర్శించిన యాత్రికులకు ఇక్కడ ఉండే శిలల శకలాలను ్మఅముతూ ఉంటారు. ఇవి బాలెంతల చనుబాలు సమృద్ధి అయ్యేందుకు ఆశీస్సులందిస్తాయని భక్తులు నమ్ముతారు.
క్రిస్మస్ స్టార్! క్రిస్మస్ అనగానే క్రిస్మస్ నక్షత్రం వెంటనే స్పురణకు వస్తుంది. క్రిస్మస్ నాడు రంగురంగుల కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న నక్షత్రాలను ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తారు. ఆప్తులకు, స్నేహితులకు, బంధువులకు స్వాగతం పలుకుతూ చిర్నవ్వుల వెలుగులను చిందిస్తూ ఈ నక్షత్రాలు దర్శనమిస్తాయి. అయితే ఈ నక్షత్రానికి క్రీస్తు జననానికి బెత్లహామ్ పట్టణానికి సంబంధం ఉంది. క్రీ.పూ.నాలుగో సంవత్సరంలో జీసస్ తల్లి తండ్రులయిన మేరీ, జోసెఫ్‌లు బెత్లహామ్‌లో నివసిస్తూండేవారు. దేవదూత గాబ్రియల్ మేరీమాతకు కలలో కనిపించి భగవంతుడు తన బిడ్డను నీ తనయుడి రూపంలో లోకానికి అంద్తిసున్నాడు అని పలికింది. ఆ గాబ్రియల్ క్ర్తీసు తండ్రి అయిన జోసెఫ్‌తో పుట్టబోయే బిడ్డకు జీసస్ అనే పేరు పెట్టండి. ఎందుకంటే ప్రజల్ని పాపాల నుంచి రక్షించే రక్షకుడుగా జీసస్ వెలుగొందుతాడు అని పలికింది.
మరోవైపు ఆనాడు బెత్లహామ్ సహా జుడియా, పరిసర ప్రాంతాలు రోమన్ల అధికారం కింద ఉండేవి. నాటి చక్రవర్తి హీరోడ్! జెరూసలెంలో తూర్పుదేశపు జ్ఞానులు (వీరిని మాగి అని వ్యవహరిస్తారు) వచ్చి యూదుల రాజుగా పుట్టిన జీసస్ ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి, ఆయనను పూజింప వచ్చితమని పలికారు. దీంతో తనకు ప్రత్యర్థిగా జీసస్ ఎదుగుతాడని హీరోడ్ రాజు కలవరపడ్డాడు. హీరోడ్ రాజు బెత్లహామ్ వెళ్ళి జీసస్ జన్మించిన ప్రదేశం తదితర వివరాలను తెలుసుకుని, రమ్మనమని ఆ జ్ఞానులను పంపాడు. ఆ జ్ఞానులు జెరూసలెంనుంచి దక్షిణ దిశగా బెత్లహామ్‌కు ప్రయాణం కట్టారు. ఆనాటి వారి ప్రస్థానాన్ని నిర్దేశిస్తూ ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది. ఆ నక్షత్రానికి గుర్తుగానే నేటి క్రిస్మస్ స్టార్ వెలుగొందుతోంది.
మరోవైపు హీరోడ్ రాజు జీసస్‌ను సంహరించడానికి నిశ్చయించుకుంటాడు. జీసస్ జన్మస్థలాన్ని, తదితర వివరాలను కచ్చితంగా తెలుసుకోలేకపోవడంతో దేశంలోని రెండేళ్ళలోపు బాలురను సంహరింపమని ఆజ్ఞాపిస్తాడు. అయితే దేవదూత జోసెఫ్‌కు కలలో కనిపించి- హీరోడ్ ఆ బిడ్డను సంహరింపాలని వెదుకుచున్నాడు కాబట్టి- నీవు, మేరీ- ఆ బిడ్డ జీసస్‌తో ఈజిప్టుకు పారిపొమ్మని ఆజ్ఞాపించింది. తదనుగుణంగా జీసస్‌తో అతని తల్లిదండ్రులు ఈజిప్టునకు ప్రయాణమయ్యారు. హీరోడ్ రాజు చనిపోయిన తరువాత తిరిగి దేవదూత ఆజ్ఞమేరకు జోసెఫ్ మేరీలు తనయుడు క్రీస్తుతో కలిసి బెత్లహామ్‌కు చేరుకున్నారు.
గొర్రెల కాపరులతో... బెత్లహామ్ పట్టణానికి తూర్పుభాగంలో విశాలమైన ప్రదేశం ఉంది. పచ్చపచ్చని ఆలివ్ చెట్లు, దూరంగా నింగిని తాకుతూ ఎతై్తన కొండలు, ఆకాశంనుంచి జాలువారుతున్న పొగమంచు, చెంగుచెంగున గెంతే గొర్రె పిల్లలు, వాటితో పాటే గొర్రెల కాపరులు... ఇలా ఆ ప్రాంతమంతా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి షెఫర్డ్స్ ఫీల్డ్ (గొర్రెల కాపరుల ప్రదేశం) అని పేరు. దీనికి ఫీల్డ్ ఆఫ రత్ అనే మరో పేరు కూడా ఉంది. దేవదూత గాబ్రియల్ జీసస్ ్మజనించాడన్న వార్తను గొర్రెల కాపరులకు ఈ ప్రదేశంలోనే వెల్లడించింది. అందుకే దీనికాపేరు. భగవంతుడైన క్రీస్తు జననం- బాధాతప్తులకు రక్షణ కవచం. పృథ్విపై శాంతి విరాజిల్లుతుంది- గొర్రెల కాపరులతో దేవదూత పలికిన పలుకులివి.
... నిజమే! పుడమితల్లికి శాంతియుత బహుమతులను అందించడానికి జన్మించిన మహనీయుడే జీసస్. ప్రేమ పంచిన ప్రేమ ్చవచును. ప్రేమ పెంచిన ప్రేమ పెరుగును అని పలికిన క్ర్తీసు ప్రేమకు ప్రతి రూపం. ఆయన బోధించిన సత్యం, ్నసేహం, శాంతి, దయ, కరుణ, మానవత్వం- ఇవన్నీ అన్ని మనస్సుల్లోనూ చిగురించాలని ఆశిద్దాం!
గుడ్‌ఫ్రైడే - చరిత్ర, ప్రాధాన్యత క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య... ముళ్ళ కంచెల భారంతో... శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు.
గుడ్‌ఫ్రైడ్ అనే పదం గ్సాడ్ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ పదం - పది లేదా 11వ శతాబ్దంలో ్థసిరపడినట్లు తెలుస్తోంది. క్రైస్తవ గ్రంధాల ప్రకారం - ఏసుక్రీస్తు నజరత్ అనే పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ పట్టణం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉంది. చాలామంది ఏసును దేవుని బిడ్డగా భావించేవారు... పూజించేవారు, కొలిచేవారు. అయితే యూదు ప్రవక్తలకు, ఉన్నతాధికారులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉండేది. ప్రజల్ని ఏసు తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు భావించేవారు. దాంతో వారు ఎలాగైనా ఏసును హతమార్చాలని కుతంత్రం పన్నారు. జుడాలని పిలవబడే 12 మంది శిష్యులతో వారు ఈ పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నించాడు. వారు ఏసుక్రీస్తును నిర్భధించారు. ఆ మర్నాడు ప్రవక్తల సంఘం ముందు హాజరుపరిచారు.
ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడని, చక్రవర్తికి పన్నులు కట్టక్కర్లేదని ప్రజలకు చెబుతున్నాడని, తాను దేవుని ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడని... ఇలా వివిధ ఆరోపణల్ని ఏసుపై రుద్దారు. ఇవన్నీ నిజమని నిర్ధారించి రోమన్ చక్రవర్తి ముందు ఏసును హాజరు పరిచారు. అయితే చక్రవర్తి మాత్రం ఆ ఆరోపణల్ని నమ్మలేదు - అయినా మతప్రవక్తలు పట్టుబట్టి - నగరంలోని విధ్వంసకాండకు కూడా ఏసే కారణమని నమ్మబలికారు. చక్రవర్తిపై వారు మరింత ఒత్తిడి తీసుకురావడంతో ఇక చేసేది లేక చక్రవర్తి - ఏసును ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ మతప్రవక్తలకు వదిలి వేశాడు. దీంతోవారు ఏసును శిలువ వేయాలని నిర్ధారించారు.
ఏసుక్రీస్తుకు తలపై ముళ్ళ కంప పెట్టారు. సైనికులు కొరడాలతో కొట్టారు. చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపారు. కొంతదూరం నడిపించారు. చుట్టూ ప్రజలు... ఆయన వెనుక ఆయన అనుచరులు... ప్రజలు రాళ్ళతో కొట్టారు. చివరకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏసుక్రీస్తుకు శిలువ వేశారు. చేతుల్ని శిలువకు మేకులతో బంధించారు. రక్తం ఓడుతున్న ఏసుక్రీస్తు మూడుగంటల తర్వాత ప్రాణం వదిలాడు. ఆ రోజు శుక్రవారం... మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసుక్రీస్తు శిలువపై తుది శ్వాస విడిచాడు. ఆ నాటి ఆ శిలువకు గుర్తుగా.. చర్చిల్లో శిలువను ఉంచే సంప్రదాయం నెలకొంది. మరణించే ముందు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఇలా ప్రార్ధించాడు.
ప్రభూ నా మరణానికి కారణమైన వీళ్ళందరిని క్షమించు. వీరు పాపులే అయినా క్షమించి వదిలిపెట్టు ఎందుకంటే పాపం అని తెలీని అమాయకులు వారు. ఏసుక్రీస్తులోని దయాగుణం, క్షమం, ఔన్నత్యాలకు ఇది నిదర్శనం. అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఏసుక్రీస్తు శిలువపై నుండి పునర్జన్మించాడు. అందుకే ఆ రోజు ఆనందసందోహాల ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడేనాడు జరుపుకునేవి అన్ని అంతకుముందు గురువారం రాత్రి ప్రారంభం అవుతాయి. చివరి సప్పర్ తీసుకున్న తరువాత - వారు ఈస్టర్ వరకు ఉపవాసం ఉంటారు.
కైస్తవులకు ఆరాధనా స్థలం - ప్రశాంతతకు ప్రతిరూపంగా, అహ్లాదకర వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచే చర్చి. ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్‌లో ఉన్న చర్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అందమైన పచ్చని చెట్ల మధ్య - ప్రపంచ శాంతికి దర్పణంగా నిలువెత్తున దర్పంతో నిలిచే ఈ చర్చి కన్నుల పండుగగా ఉంటుంది.