కరుణామయి మేరిమాత ఇలపై వెలసిన వేళ

కరుణామయి మేరిమాత, అనురాగం నిండిన మేరిమాత ఇలపై వెలసింది... ఏసు ప్రభువుకు జన్మనిచ్చిన పుణ్య చరిత్ర ఆమెది. సెప్టెంబర్ 8న ఆమె జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు జరుపుకుంటున్నారు.

మెరీమాత తల్లిదండ్రుల పేర్లు సరిగ్గా నమోదు కానప్పటికీ, జుయాచిమ్, అన్నిలకు మెరీమాత జన్మించినట్టు
మేరి మాత విగ్రహాలు...
  కాథలిక్ క్రైస్తవులు మేరిమాతను ఆరోగ్య మాత, లూర్తు మాత, హృదయ మాత తదితర పేర్లతో కొలుస్తుంటారు. ఏసుప్రభును ఒడిలో కూర్చోబెట్టుకున్న మేరిమాత విగ్రహాలు అన్ని చర్చిలలోనూ కనిపిస్తుంటాయి.       
భక్తులు నమ్ముతారు. కాథలిక్ క్రైస్తవులు మేరిమాతను ఆరోగ్య మాత, లూర్తు మాత, హృదయ మాత తదితర పేర్లతో కొలుస్తున్నారు. ఏసుప్రభును ఒడిలో కూర్చోబెట్టుకున్న మేరిమాత విగ్రహాలు అన్ని చర్చిలలోనూ కనిపిస్తుంటాయి.

గేబ్రియల్ దేవత తన గర్భంలో ప్రభువు జన్మించనున్నాడని మేరీమాతకు ప్రత్యక్షమై చెప్పింది. దీంతో కంగారు పడిన మేరీమాత ఆమె బంధువు అయిన ఎలిజబెత్‌ను కలిసి విషయం చెప్పింది. మేరీ "ప్రభువుకు మాత" కానుందని ఎలిజబెత్ ప్రకటించింది. ఆ తర్వాత మూడు నెలల గడిచిన అనంతరం ఇంటికి తిరిగివచ్చింది మేరీమాత. అప్పటి రోమన్ రాజు సలహా మేరకు మేరీమాత బెత్లహమ్ చేరుకుంది.

అక్కడే ఏసు ప్రభువు జన్మించాడు. కన్యగా ఉన్న సమయంలోనే ఆమె ఏసు ప్రభువుకు జన్మనిచ్చింది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు అవతారమెత్తాలని భావించిన ఏసు ప్రభువు పవిత్రమైన గర్భం కోసం అన్వేషించాడు. ఆ సమయంలో మేరీమాత గర్భం నుంచి ఉద్భవించాలని నిర్ణయించి దేవదూత ద్వారా సందేశమిచ్చాడని బైబిల్‌లో చెప్పబడి ఉంది.

వెబ్దునియా పై చదవండి