ఈస్టర్ ఏప్రిల్ 1వ తేదీన... ప్రభువు యేసు మళ్లీ వారి కోసం వచ్చాడు...

బుధవారం, 28 మార్చి 2018 (22:14 IST)
ఈస్టర్ క్రైస్తవులకు అతి పెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమ పదించిన మూడు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో వచ్చారు. దీంతో ప్రజలు హర్షోల్లాసం ప్రకటించి ఆనందంలో మునిగి తేలియాడారు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. 
 
క్రిస్మస్ పండుగ లాగా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదు. ఏప్రిల్ 1వ తేదీన ఆదివారం నాడు ఈస్టర్ పండుగ వస్తుంది. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. దీంతో ప్రకృతి పులకిస్తుంది. క్రీస్తు పరమ పదించిన తర్వాత ఆయన అనుయాయులు నిరాశా నిస్పృహలమధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ప్రభువు యేసు మళ్ళీ వారికోసం ప్రాణాలతో వచ్చారనేది కథనం. క్రీస్తు అనుయాయులందరూ ఉదాసీనంగా కూర్చొని ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టినట్టుండింది. తలుపు తెరిచిన తర్వాత ముందర ఓ స్త్రీ నిలబడివుంది. ఆమె లోపలికి వచ్చి అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసి ఆమె ఇలా అన్నారు... తను ఇద్దరు స్త్రీలతో కలిసి యేసు శవంపై నీళ్ళు చల్లడానికి ఆయన సమాధి వద్దకు వెళ్ళాను.
 
అక్కడ చూస్తే సమాధి పై భాగం తెరవబడివుంది. అందులో దేవదూతలిద్దరు కనబడ్డారు. వారు తెల్లటి ధవళ వస్త్రాలు తొడుక్కుని ఉన్నారు. వారి ముఖంలో కాంతి ప్రస్ఫుటమౌతోంది. వారేమన్నారంటే... మీరు నాజరేథ్‌కు చెందిన యేసును వెతుకుతున్నట్లున్నారు కదూ. వారిక్కడ లేరు. వారిప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల మధ్య వారిని ఎందుకు వెతుకుతున్నట్లు? వెళ్ళి వారి అనుయాయులందరికీ ఈ సమాచారం అందించండి. అని ఆ దేవదూతలు చెప్పినట్లు ఆమె వారందరికీ వివరించింది.
 
ఆమె చెప్పిన వార్తను విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. వారికి ఏ మాత్రం నమ్మకం కలగలేదు. ఈ మధ్యలో మరో స్త్రీ మగ్దలేనా సమాధివద్ద ఏడుస్తూ కూర్చొంది. ఎవరో ఆమె వద్దకు వస్తున్నట్లు చూసింది. అప్పుడు ఆమె ఇలా అనింది...మహాశయా! మీరు గనుక యేసు ప్రభువు శవాన్ని ఇక్కడినుంచి తీసివేసి వుంటే కనీసం ఎక్కడ పెట్టారో చెప్పండి. వెంటనే సమాధానం లభించిందిలా-- "నా" ఈ శబ్దం ఎక్కడో విన్నట్టుందే..ఇది పరిచయమున్న గొంతే. ఇక ఆమె ఆశ్చర్యానికి తావేలేదు.
 
ఆమె తొలిసారిగా క్రీస్తును చూసింది. గెసబోస్తూ.."ప్రభూ!"... యేసు క్రీస్తు ఇలా అన్నారు. నీవు నా అనుయాయులకు చెప్పిలా...వారిని నేను అతి త్వరలో కలుస్తానని వారికి చెప్పు. మగ్దలేనా ఈ సందేశాన్ని ప్రభువునుంచి తీసుకుని వారి అనుయాయులకు వినిపించింది. ఈ సందర్భంగానే ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఇదే శబ్దం జర్మనీ భాషలో "ఈఓస్టర్" అని అంటారు. దీని అర్థం ఏంటంటే "దేవీ" అని. ఈ దేవీని వసంత దేవీగా కూడా పిలుస్తారు.
 
దీని తర్వాత ప్రభు యేసు నలభై రోజులవరకు తన అనుయాయుల వద్దకు వెళ్ళి వారిని ప్రొత్సహించి ఉపదేశించేవారిలా.... "మీకందరికీ తప్పకుండా శాంతి లభిస్తుంది". దీంతో వారిలో ఉత్సాహం, విశ్వాసాన్ని నింపుతుండేవారు. ప్రభు యేసు జీవించేఉన్నారు. ఆయన మహిమాన్వితుడు కాబట్టి క్రిస్టియన్లందరికీ ఆనందం, జీవితంపై ఆశలు రేకెత్తించి వారిలో ధైర్యాన్ని నింపుతుండేవారు. అదే ధైర్యంతో ప్రతి క్రిస్టియన్ కూడా వారికొచ్చే కష్టాలను ఎదుర్కొంటూ యేసును ప్రార్థిస్తుంటారు. 
 
ఈస్టర్ పండుగను క్రిస్మస్ పండుగలా ఘనంగా జురుపుకోరు. ఆయినాకూడా క్రిస్టియన్ల పండుగలలో ఇది చాలా ఉత్తమమైనది. ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం నాడు "గుడ్ ఫ్రైడే"గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజే యేసును శిలువ చేశారు. ఆ రోజు క్రిస్టియన్లందరూ నల్లటి వస్త్రాలను ధరిస్తారు. దీంతో వారు తమ సంతాపం వ్యక్తం చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు