కావలసిన పదార్థాలు : వరిపిండి... 600 గ్రా. బంగాళాదుంపలు... ఒక కేజీ నూనె... నాలుగు టీ. వెల్లుల్లి... నాలుగు రేకలు పచ్చిమిర్చి... నాలుగు పాలకూర... 600 గ్రా. కాలీఫ్లవర్... 300 గ్రా. ఉప్పు... తగినంత మిరియాలు... ఒక టీ.
తయారీ విధానం : తరిగిన బంగాళాదుంపల్ని వరిపిండిలో వేసి మెత్తగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడిచేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. అందులోనే పాలకూర, కాలీఫ్లవర్, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి.
ఇప్పుడు పిండిముద్దని గుండ్రటి ముద్దలుగా చేసి ఒక్కో ముద్దనీ చిన్న పూరీలా వత్తి అందులో ఉడికించిన కూరని పెట్టి అంచులు మూసేసి కట్‌లెట్‌ని అరచేతితో చిన్నగా వత్తాలి. ఇలా పిండి ముద్దనంతటినీ కట్‌లెట్‌లుగా చేసి, ఓ డిష్‌లో పెట్టి, ఓవెన్‌లో పావుగంటసేపు ఉడికించాలి. ఉడికిన కట్‌లెట్లను అవసరమైతే కొద్దిగా నూనె వేసి, వేయించి పచ్చడితో వడ్డిస్తే సరి...!