ఉరుకుల పరుగుల జీవితానికో "కాక్‌టెయిల్"

ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రిపూట పడుకునేదాకా క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో కాలం నెట్టుకొస్తుంటారు ఉద్యోగస్తులు. ఇలాంటి వారిలో శరీరాన్ని, మెదడుని ఉత్తేజ పరిచేలా, హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని క్రమబద్ధం చేసేలా, తగినంత క్యాల్షియం అందజేసేలా, అస్టియోపొరాసిస్ బారిన పడకుండా కాపాడేలా సహాయపడుతుంది "ఫ్రూట్ కాక్‌టెయిల్". అదెలా చేయాలో చూద్దాం...!

కావలసిన పదార్థాలు :
ఆపిల్ ముక్కలు... ఒక కప్పు
నల్లద్రాక్ష... ఒక కప్పు
ఫైనాఫిల్ ముక్కలు... ఒక కప్పు
ఆరెంజ్ జ్యూస్... అర కప్పు
గ్లూకోజ్ లేదా చక్కెర... ఒక టీ.
ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడా

తయారీ విధానం :
మిక్సీ జార్‌లో ఆపిల్, ద్రాక్ష, ఫైనాఫిల్ ముక్కలను వేసి బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను గ్లాసుల్లో పోసి, ఆరెంజ్ జ్యూస్, గ్లూకోజ్ పౌడర్ వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడిని జ్యూస్ గ్లాసుల్లో వేసి, కలియబెట్టి... ఐస్‌క్యూబ్స్ కలిపి తీసుకోవాలి. అంతే చల్లచల్లని ఫ్రూట్ కాక్‌టెయిల్ రెడీ అయినట్లే...!

ఈ ఫ్రూట్ కాక్‌టెయిల్‌ని సేవించటం వల్ల.. శరీరానికి తగినంత శక్తి, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, ఐరన్, క్యాల్షియం తదితరాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులూ, వీలయితే ఫ్రూట్ కాక్‌టెయిల్‌ తీసుకుంటారు కదూ...?!

వెబ్దునియా పై చదవండి