కొబ్బరిపాలతో "సాగో సూప్‌" చేద్దామా..?

కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం (సాగో)... రెండు కప్పులు
మంచినీరు... ఒకటిన్నర కప్పు
కొబ్బరిపాలు... రెండు కప్పులు
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
ఉల్లిముద్ద... రెండు టీ.
వెన్న... రెండు టీ.
మైదా... రెండు టీ.
వెల్లుల్లి తురుము... ఒక టీ.
పచ్చిమిర్చి... ఒక టీ.
కొత్తిమీర, పుదీనా తురుము... చెరో టీ.
అజినమోటో... అర టీ.
మిరియాల పొడి... పావు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కార్న్‌ఫ్లోర్‌లో మైదా, మిరియాలపొడి, అజినమోటో వేసి తగినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలిపి ఉంచాలి. బాణలిలో సగం వెన్న వేసి వేడిచేసి ఉల్లి, వెల్లుల్లిముద్ద, పుదీనా తురుము వేసి దోరగా వేయించి నీళ్లు పోసి మరిగించాలి. తరువాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉడికించాలి.

సగ్గుబియ్యం కాస్త పలుకు ఉండగానే కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం పోస్తూ కలపాలి. పచ్చిమిర్చి, ఉప్పు, మిగిలిన వెన్న వేసి కొబ్బరి పాలు కూడా పోసి బాగా కలిపి చివరగా కొత్తిమీర చల్లితే... కొబ్బరిపాల రుచితో కమ్మగా అలరించే సగ్గుబియ్యం సూప్‌ రెడీ అయినట్లే..!

వెబ్దునియా పై చదవండి