కావలసిన పదార్థాలు : వెన్న... వంద గ్రా. చిన్న ఉల్లిపాయలు... రెండు కార్న్‌ఫ్లోర్... ఎనిమిది టీ. బ్రెడ్ స్లైసులు... పన్నెండు (టోస్ట్ చేసినవి) మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... అర కేజీ (తరిగినవి) మీగడ... 700 మి.లీ. కర్రీ పౌడర్... నాలుగు టీ. పార్ల్సీ ఆకులు... కాసిన్ని
తయారీ విధానం : బాణలిలో వెన్న వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. అందులోని నిమ్మకాయ రసం, పుట్టగొడుగులు వేసి మూడు నిమిషాలపాటు ఫ్రై చేయాలి. దీనికి కార్న్‌ఫ్లోర్ కలిపి ఉడికిస్తూ, మీగడ కూడా చేర్చాలి. ఈ మిశ్రమం గట్టిపడేంతదాకా ఉడికించాలి.
చివర్లో కర్రీ పొడి, తగినంత ఉప్పు, మిరియాలపొడిని కలపాలి. ఆపై ప్లార్సీ ఆకుల (సూపర్ బజార్లలో దొరుకుతాయి)ను కూడా వేయాలి. ఈ కర్రీని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కల మధ్యలో పెట్టి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే క్రీమీ మష్రూమ్స్ ఆన్ టోస్ట్ రెడీ అయినట్లే...!