కావలసిన పదార్థాలు : వేయించిన పీనట్స్... పావుకేజీ వెల్లుల్లి... పదిహేను బ్రెడ్... నాలుగు స్లైసులు ఆలీవ్ ఆయిల్... అర కప్పు వెనిగర్... రెండు టీ. తరిగిన కొత్తిమీర... తగినంత
తయారీ విధానం : బ్రెడ్ మీద గోధుమ రంగులో ఉండే పొరను తీసివేయాలి. వెల్లుల్లిని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయిన తరువాత తీసేయాలి. బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పీనట్స్ పేస్ట్‌ను కలపాలి. మళ్లీ గ్రైండర్‌లో వేసి, ఎక్కువ మెత్తగా కాకుండా చూస్తూ కాసేపు తిప్పాలి. దీనికి వెనిగర్, ఆయిల్‌ను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాన్ని ఓ సర్వింగ్ డిష్‌లోకి తీసి, పైన తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే గార్లిక్ పీనట్స్ స్ప్రెడ్ సిద్ధమైనట్లే...!