కావలసిన పదార్థాలు : కార్న్‌ఫ్లోర్... అర కేజీ కాస్టర్ షుగర్... 700 గ్రా. యోగర్ట్... 750ఎం.ఎల్ కోకో పౌడర్... 150 గ్రా. వెన్న... 200 గ్రా. కోడిగుడ్లు... ఆరు సోడా బై కార్బొనేట్... మూడు టీ. రమ్ కలిపిన పంచదార నీళ్లు... కొద్దిగా
ఫిల్లింగ్ కోసం... యోగర్ట్... 150 గ్రా. వెన్న... వంద గ్రా. నారింజ తొనలు... రెండు బేకింగ్ కోసం నూనె... కొద్దిగా వెనీలా ఎసెన్స్... ఒక టీ.
తయారీ విధానం : వెన్నలో పంచదార, కార్న్‌ఫ్లోర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, కోడిగుడ్డు సొన, యోగర్ట్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. దీనికి వెనీలా ఎసెన్స్, ఐషింగ్ షుగర్, నారింజ తొనలు జతచేయాలి. పదార్థాలన్నీ బాగా కలిసేంతదాకా గిలకొట్టాలి. ఒక టిన్‌కు నూనె రాసి పై మిశ్రమాన్నంతటినీ పోసి 180 సెంటీగ్రేడ్ వద్ద బేక్ చేసి ఉడికాక తీసేయాలి.
కేక్ బాగా చల్లబడిన తరువాత పై భాగంలో స్ట్రాబెర్రీస్ అలంకరించి, ఐసింగ్ షుగర్ చల్లాలి. ఫిల్లింగ్ కోసం తయారు చేసుకున్న పదార్థాలన్నింటినీ బాగా కలిపి, కేక్ పైన పోసి మళ్లీ స్టాబెర్రీలను అమర్చి, ఐసింగ్ షుగర్ చల్లినట్లయితే... చాకొలెట్ స్ట్రాబెర్రీ కేక్ సిద్ధమైనట్లే...!