కావలసిన పదార్థాలు : జొన్నలు... పావు కప్పు సజ్జలు... పావు కప్పు సోయాగింజలు... పావు కప్పు శెనగలు... పావు కప్పు వేరుశెనగపప్పు... పావు కప్పు ఉల్లిపాయ... ఒకటి టొమోటో... ఒకటి కొత్తిమీర తరుము... రెండు టీ. ఆవ నూనె... అర టీ. ఉప్పు... తగినంత పచ్చిమిర్చి... ఒకటి
తయారీ విధానం : జొన్నలు, సజ్జలు, సోయా, సెనగలు అన్నీ మొలకలు వచ్చేలా నానబెట్టి నూనె వెయ్యకుండా విడివిడిగా వేయించి తీయాలి. వేరుసెనగ పప్పు కూడా నానబెట్టి వేయించాలి. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కోయాలి. ముందుగా మొలకల గింజలన్నింటినీ బాగా కలపాలి. అందులో ఆవనూనె, వేరుసెనగ పప్పులు, ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర... అన్నీ వేసి బాగా కలపాలి. ఏదైనా పచ్చడి లేదా సాస్ నంజుకుని తింటే బాగుంటుంది.