కావలసిన పదార్థాలు : పనీర్... 400 గ్రా. గడ్డపెరుగు... ఆరు టీ. నిమ్మరసం... రెండు టీ. కారం... ఒక టీ. గరంమసాలా... అర టీ. అల్లంవెల్లుల్లి... అర టీ. జీలకర్రపొడి... అర టీ. కార్న్‌ఫ్లోర్... ఆరు టీ. కోడిగుడ్లు... రెండు మైదాపిండి... ఒక కప్పు ఉప్పు... తగినంత నూనె... సరిపడా ఆరెంజ్ ఫుడ్ కలర్... చిటికెడు
తయారీ విధానం : పనీర్‌ను ఒకటిన్నర అంగుళాల పొడవు ముక్కలుగా కోయాలి. వీటిని ఓ పాత్రలో వేసి పెరుగు, నిమ్మరసం, కారం, గరంమసాలా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, మైదాపిండి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి జారుడుగా కలపాలి.
ఇప్పుడు దీన్ని నాన్‌స్టిక్ పాన్‌లో పలుచని దోసెలా వేసి తరవాత దాన్ని సన్నని పట్టీల్లా కత్తిరించాలి. ఉప్పూకారం పట్టించిన పనీర్ముక్కలకు మైదా పట్టీల్ని చుట్టాలి. ఓ బాణలిలో నూనె పోసి కాగాక వేయించి తీసి... చిల్లీసాస్‌తో కలిపి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్ థ్రెడ్ విత్ కార్న్‌ఫ్లోర్ రెడీ అయినట్లే...!