పనీర్‌ స్టఫ్‌డ్‌ పరాటా

కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అర కేజీ
పనీర్... పావు కేజీ
పచ్చిమిర్చి... నాలుగు
కొత్తిమీర... రెండు కట్టలు
ఉప్పు... తగినంత
నిమ్మరసం... రెండు టీ.
నూనె... 50 గ్రా.

తయారీ విధానం :
గోధుమపిండిని తగినంత నీటితో బాగా కలిపి 10 ముద్దలుగా విడదీసి ఉంచాలి. పనీర్‌ను సన్నగా తురమాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరగాలి. ఈ రెండింటికి ఉప్పు, నిమ్మరసం చేర్చి మొత్తాన్ని కలిపి పది సమాన ముద్దలుగా చేయాలి. గోధుమపిండి ముద్దలను ఒక్కొక్కటిగా తీసుకుని చేతివేళ్లతో ముద్దను కప్పు ఆకారంలో చేసి పనీర్‌ను మధ్యలో ఉంచి చుట్టూ మూసేయాలి.

ఇప్పుడు ఈ ముద్దకు పిండి అద్దుతూ చపాతీలా చేసి పెనంమీద నూనెతో రెండువైపులా కాల్చి తీయాలి. పెరుగుపచ్చడి లేదా మసాలాకూరతో వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి