తయారీ విధానం : చేపను గ్రిల్ చేసిన తరువాత ముళ్లు తీసివేసి వేయించి ఒక బౌల్లో ఉంచాలి. అందులోనే పచ్చిమిరప పేస్ట్, సోయాసాస్, కొబ్బరిపాలు, గుడ్డుసొన, మొక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వేసి వడల్లాగా వేయించి తీయాలి. సాస్ కోసం చెప్పుకున్న వస్తువులతో సాస్ తయారు చేసి ఈ ముక్కలపై పోసి కీరా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.