కావలసిన పదార్థాలు : బేబీ పొటాటోలు (చిన్న బంగాళాదుంపలు)... అర కేజీ కొత్తిమీర... 2 కప్పులు పచ్చిమిర్చి... పది అల్లంవెల్లుల్లి... ఒక టీ. జీలకర్రపొడి... అర టీ. ఉప్పు... తగినంత మీగడ... 4 టీ. నిమ్మరసం... 2 టీ. మంచినీళ్లు... తగినన్ని పసుపు... చిటికెడు కార్న్‌ఫ్లోర్... 2 టీ.
తయారీ విధానం : బేబీ పొటాటోల్ని చెక్కు తీసి, పైభాగంలో చాకుతో చిన్న గాటు పెట్టి, నూనెలో దోరగా వేయించి తీయాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీయాలి. బాణలిలో నాలుగు టీస్పూన్లు నూనె వేసి కాగనివ్వాలి.
అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించి, బంగాళాదుంపల్ని వేసి తగినంత ఉప్పు, పసుపు చల్లి సన్నని సెగమీద రెండు నిమిషాలు వేయించాలి. తరువాత కొత్తిమీర గుజ్జు వేసి బాగా కలిపి దించాలి. అంతే వెరైటీగా ఉండే బేబీ పొటాటో కొరియాండర్ లీ తయారైనట్లే...!