కావలసిన పదార్థాలు : పాలు... అర లీ. కుంకుమపువ్వు... ఆరు కాడలు పంచదార... ఒకటిన్నర టీ. యాలకులపొడి... పావు టీ. నానబెట్టిన బాదంపప్పులు... ఆరు పిస్తా పప్పులు... నాలుగు జీలకర్ర పొడి... చిటికెడు
తయారీ విధానం : దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నటి మంటపై పది నిమిషాలసేపు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులను కూడా అందులో వేసి బాగా కలిపి దించేయాలి.
గది ఉష్ణోగ్రత వద్దకు పై మిశ్రమం చల్లబడ్డాక తీసి ఫ్రిజ్‌లో ఉంచి, బాగా చల్లబడేలా చేయాలి. తరువాత ఫ్రిజ్‌లోంచి తీసి సర్వింగ్ గ్లాసులలో పోసి పైన జీరా పొడి చల్లి అతిథులకు చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే సఫ్రాన్ మిల్క్ షర్బత్ రెడీ అయినట్లే...! వేసవి తాపానికి ఈ షర్బత్ మంచి ఔషధంలాగా కూడా పనిచేయగలదు.