మినప మురుకు.. తయారీ విధానం..?

శుక్రవారం, 15 మార్చి 2019 (11:14 IST)
కావలసిన పదార్థాలు: 
మినపప్పు - 2 గ్లాసులు
బియ్యం - 6 గ్లాసులు
వెన్న - 2 స్పూన్స్
మిరపకారం - 1 స్పూన్
వాము - అరస్పూన్
నువ్వులు - 1 స్పూన్
ఉప్పు - తగినంత
నువ్వుల నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా మినప్పప్పు, బియ్యాన్ని కలిపి మెత్తగా పిండి పట్టించాలి. ఆపై 2 స్పూన్ల వెన్న, మిరపకారం, ఉప్పు, చల్లని నీరు పోస్తూ ఉండలుగా లేకుండా జంతికల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని గొట్టంలో తగినంత పిండి ఉంచాలి. తరువాత నూనె వేడిచేసి.. పిండి మిశ్రమాన్ని జంతికల మాదిరిగా చుట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. అంతే... మినప మురుకు రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు