కార్న్ శాండ్‌విచ్

కావలసిన పదార్థాలు :
బ్రెడ్... ఎనిమిది స్లైసులు
పచ్చిబఠాణీలు... రెండు కప్పులు
మొక్కజొన్న గింజలు... ఒక కప్పు
క్యాప్సికమ్... రెండు
ఉల్లిపాయ... రెండు
టొమోటోలు... రెండు
నూనె... రెండు టీ.
వెన్న, ఛీజ్... చెరో రెండు టీ.
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
మొక్కజొన్న గింజలు, పచ్చిబఠాణీలను కలిపి కుక్కర్‌లో ఉడికించి ఉంచాలి. మూకుడులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి వేయించాలి. తరువాత అందులో ఉడికించిన మొక్కజొన్న గింజలు, బఠాణీలను కలిపి వేయించాలి.

ఆపై టొమోటో ముక్కలు, తగినంత ఉప్పు కూడా కలపాలి. చివరగా ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌పైన సర్ది, పైన మరో బ్రెడ్ పెట్టి గట్టిగా అదిమి వెన్న పూయాలి. ఇలా చేసుకున్న బ్రెడ్ ముక్కలను జాగ్రత్తగా తీసి కాలుతున్న పెనంపై వేసి నూనె వేస్తూ గోధుమరంగు వచ్చేదాకా కాల్చి తీసేయాలి. వీటిని టొమోటో సూప్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి