కీరా షర్బత్

బుధవారం, 16 జులై 2008 (13:35 IST)
కావలసిన పదార్థాలు :
కీరా రసం... అర గ్లాసు
మంచినీళ్ళు... ఒక గ్లాసు
నిమ్మకాయ... ఒకటి
చక్కెర... సరిపడా
ఉప్పు... చిటికెడు
మిరియాలపొడి... చిటికెడు

తయారీ విధానం :
ముందుగా మంచినీటిలో కీరా రసం కలిపిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి. దాంట్లో చక్కెర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కరిగేదాకా కలపాలి. చివరగా పైనుండి సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి