జాగరీ పెప్పర్ డ్రింక్

కావలసిన పదార్థాలు :
బెల్లం... 200 గ్రా.
అల్లం... మీడియం సైజు ముక్క
మిరియాలపొడి... నాలుగు టీ.
నిమ్మరసం... ఎనిమిది టీ.
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బెల్లాన్ని కరిగించాలి. అల్లంను మెత్తగా దంచి, బెల్లం నీటిలో కలపాలి. దీనికి మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిని వడకట్టి కప్పుల్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. అంతే జాగరీ పెప్పర్ డ్రింక్ తయారైనట్లే...!

బెల్లంలో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను దరిచేరనీయదు. మిరియాలలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది. అల్లం జీర్ణక్రియను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సో... మీరూ జాగరీ పెప్పర్ డ్రింక్ తయారుచేయటం మరచిపోరు కదూ...!!

వెబ్దునియా పై చదవండి