కావలసిన పదార్థాలు : గుండ్రటి టమోటోలు... అరకేజీ నూనె... వేయించేందుకు సరిపడా మిక్చర్... ఒక కప్పు (టమోటోల్లో కూరేందుకు) పసుపు... అర టీస్పూన్ ధనియా, జీరాపొడి... రెండు టీస్పూన్లు కారం... రెండు టీస్పూన్లు పంచదార... రెండు టీస్పూన్లు కొత్తిమీర... ఒక కట్ట ఉప్పు... సరిపడా శనగపిండి... ఒక కప్పు (టమోటోలపై పిండికి) పసుపు... చిటికెడు వేడినూనె... ఒక టీస్పూన్ నీరు... సరిపడా ఎరుపురంగు... చిటికెడు
తయారీ విధానం : టమోటోల తొడిమలను తీసి అక్కడే చాలా జాగ్రత్తగా గుండ్రని గాటు పెట్టి లోపలి గుజ్జునంతటినీ తీసివేసి పక్కనుంచుకోవాలి. పైన చెప్పిన మిక్చర్, పసుపు, ధనియా, జీరా పొడులు, కారం, పంచదార, కొత్తిమీర, ఉప్పు లాంటి పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టమోటోలలో కూరి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.
ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, పసుపు, వేడినూనె, సరిపడా నీళ్ళు వేసి బజ్జీల పిండిలాగా జారుగా కలుపుకోవాలి. ఫ్రిజ్‌లోని టమోటోలను తీసి పిండిలో ముంచిలో కడాయిలో కాగుతున్న నూనెలో వేయాలి. అలా ఒక్కోటిగా వేస్తూ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని వేడి వేడిగా పెరుగు పచ్చడితో తింటే రుచి అదిరిపోతుంది మరి...!