నూడుల్స్‌ క్యారట్‌ మసాలా

కావలసిన పదార్థాలు :
నూడుల్స్... పావు కేజీ
మంచినీళ్లు... అర లీ.
క్యారెట్‌ తురుము... ఒక కప్పు
కొత్తిమీర తురుము... అర కప్పు,
పచ్చిమిర్చి... రెండు
నిమ్మరసం... ఒక టీ.
ఉప్పు... తగినంత
మిరియాల పొడి... పావు టీ.
మసాలా పొడి... ఒక టీ.

తయారీ విధానం :
బాణలిలో నీళ్లు పోసి మరిగించి, క్యారెట్‌ తురుము వేసి మూత పెట్టాలి. కాసేపు ఉడికించిన తరవాత నూడుల్స్‌ వేయాలి. అవి ఉడికిన తరవాత మసాలా పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర చల్లి సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించి దించాలి. చివరగా నిమ్మరసం పోసి కలిపితే క్యారెట్‌ మసాలా రెడీ అయినట్లే..! మీరు కూడా ట్రై చేయండి మరి...!

వెబ్దునియా పై చదవండి