కావలసిన పదార్థాలు : కొరమీను... అర కిలో అల్లంవెల్లుల్లి... 5 గ్రా. ఉల్లిపాయలు... రెండు ఎండుమిర్చి... రెండు పచ్చిమిర్చి... ఒకటి కొత్తిమీర... అర కప్పు గసగసాలు.. రెండు టీ. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి... పోపుకు సరిపడా ఆవనూనె... గరిటెడు నిమ్మకాయ... సగం చెక్క బెల్లం... చిన్న ముక్క ఉప్పు... తగినంత
తయారీ విధానం : అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, గసగసాలు, పచ్చిమిర్చిలను కలిపి రుబ్బుకోవాలి. చేపల్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఉప్పు రాసి ఉంచాలి. బాణలిలో ఆవనూనె వేసి వేడయ్యాక.. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్రలతో పోపు పెట్టి, పైన రుబ్బి ఉంచిన మసాలా ముద్దను వేసి బాగా వేయించాలి.
మసాలా వేగిన తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, బెల్లం వేసి సన్నటి సెగపై ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి ఉడికేదాకా ఉంచి దించేయాలి. అవసరమయితే నిమ్మరసం పిండుకుని వేడివేడిగా తింటే ఫిష్ మాచెర్ జాల్ రుచే వేరుగా ఉంటుంది