"ఫ్రైడ్ ఫిష్ కేక్" గార్నిషింగ్ విత్ కుకుంబర్

కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ ఫిష్.. 200 గ్రా.
పచ్చిమిరప పేస్ట్.. 2 టీ.
సోయా సాస్. 2 టీ.
కొబ్బరిపాలు.. 2 పెద్ద టీ.
గుడ్డు.. ఒకటి
కార్న్‌ఫ్లోర్.. ఒక టీ.
మిరియాలపొడి.. అర టీ.
బీన్స్ తరుగు.. 150 గ్రా.
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా

సాస్ కోసం..
ఎండుమిర్చి.. 2
వెల్లుల్లి.. 2 రెబ్బలు
కొత్తిమీర తరుగు.. ఒక టీ.
పల్లీలు.. 25 గ్రా.
చక్కెర.. 2 టీ.
నిమ్మరసం.. 1 టీ.
సోయాసాస్.. 1 టీ.
చికెన్ స్టాక్.. 3 టీ.
కీరా.. సగం

తయారీ విధానం :
చేపను గ్రిల్ చేసిన తరువాత ముళ్లు తీసివేసి వేయించి ఒక బౌల్‌లో ఉంచాలి. అందులోనే పచ్చిమిరప పేస్ట్, సోయాసాస్, కొబ్బరిపాలు, గుడ్డుసొన, మొక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వేసి వడల్లాగా వేయించి తీయాలి. సాస్ కోసం చెప్పుకున్న వస్తువులతో సాస్ తయారు చేసి ఈ ముక్కలపై పోసి కీరా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి