కావలసిన పదార్థాలు : వెన్న... 60 గ్రా. పంచదార... 60 గ్రా. గోధుమపిండి... 60 గ్రా. అరటి పండ్లు... 2 పాలు... 3/4 కప్పు గుడ్లు... 2
తయారీ విధానం : ముందుగా గోధుమపిండిలో పంచదార, వెన్న వేసి బాగా కలిపి, అందులోనే పాలు పోసి మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నటిసెగపై చిక్కగా ఉడకనివ్వాలి. గుడ్లు పగులగొట్టి, పచ్చసొనను విడిగా తీయాలి. ఉడికించిన పిండిలో దించిన తరువాత పచ్చసొనను కలిపి, బాగా చిలకాలి.
దీంట్లోనే అరటిపండ్ల ముక్కలు తరిగి కలపాలి. బేకింగ్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి 20 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత గుడ్లలోని తెల్లసొన, ఒక టీస్పూన్ పంచదారపొడి కలిపి ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఫుడ్డింగ్ పైన పోసి, గోధుమరంగు వచ్చేదాకా మళ్లీ ఉడికించాలి. అంతే బనానా బటర్ ఫుడ్డింగ్ రెడీ అయినట్లే..!