కావలసిన పదార్థాలు : మీడియం సైజు వంకాయలు... మూడు ఉప్పు... తగినంత నూనె... వేయించేందుకు సరిపడా
చెర్మోలా కోసం : వెల్లుల్లి... రెండు రెబ్బలు జీలకర్ర... ఒక టీ. దాల్చినచెక్క పొడి... ఒక టీ. మిరియాలపొడి... పావు టీ. నిమ్మరసం... పావు కప్పు కొత్తిమీర తురుము... 3 టీ. పుదీనా తురుము... 3 టీ. రీఫైండ్ ఆయిల్... ముప్పావు కప్పు
తయారీ విధానం : వంకాయలను చిప్స్‌లాగా గుండ్రని ముక్కల్లా తరగాలి. వాటిమీద ఉప్పు చల్లి ఓ అరగంటసేపు పక్కన ఉంచాలి. ఆ తరువాత ముక్కల్ని కడిగి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడు వీటికి నూనె పూసి గ్రిల్ ఉన్న ఓవెన్‌ను ముందుగానే వేడిచేసి అందులో ఉంచి, బంగారు రంగులోకి వచ్చేదాకా ఉంచాలి.
తరువాత బయటికి తీసి కాసేపు పేపర్‌మీద ఉంచితే నూనె ఉంటే పీల్చేసుకుంటుంది. చెర్మోలా తయారీ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ కలగలిపి మూతపెట్టి ఓ గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి బయటికి తీసి, పైన వేయించుకున్న వంకాయ చిప్స్‌తో కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.