కావలసిన పదార్థాలు : బ్రెడ్ ముక్కలు... పదిహేను వెన్న... ఒక టీ.
చట్నీ కోసం... అల్లం... చిన్నసైజు ముక్క వెల్లుల్లి... ఆరు రేకలు జీలకర్ర... ఒక టీ. కారం... ఒకటిన్నర టీ. వేయించిన శెనగపప్పు... రెండు టీ. చింతపండు.. కొద్దిగా ఉప్పు... తగినంత
తయారీ విధానం : చట్నీకోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ ముక్కకీ కాస్తంత వెన్న, కొద్దిగా చట్నీ రాయాలి. బాణలి లేదా పెనం మీద కాస్త నూనె వేసి ఈ బ్రెడ్ ముక్కలను ఉంచి రెండువైపులా ఎర్రగా కాల్చాలి. వీటిని ఓవెన్లోని టోస్టర్లో కూడా పెట్టి కాల్చుకోవచ్చు. అంతే బ్రెడ్ మసాలా టోన్ తయారైనట్లే..! వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి.