బ్రెడ్‌ క్యాప్సికమ్ పిజ్జా

కావలసిన పదార్థాలు :
బ్రెడ్ పీసులు... ఆరు
క్యాప్సికమ్స్... మూడు
ఛీజ్... వంద గ్రా.
ఉల్లిపాయలు... మూడు
వెల్లుల్లి... రెండు
టొమోటో కెచప్... ఆరు టీ.
కారం... ఒక టీ.

తయారీ విధానం :
బ్రెడ్‌ పీసులను తీసుకుని గుండ్రంగా కత్తిరించాలి. తరవాత దానిపైన టొమాటో కెచప్‌ పూయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోసి... బ్రెడ్‌మీద పరచాలి. తరవాత ఛీజ్‌ను కూడా సన్నగా తురిమి.. దాన్ని కూడా బ్రెడ్‌పైన పరచి, కారంపొడిని కూడా చల్లాలి.

ఇప్పుడు ఈ బ్రెడ్ పీసులను మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించి తీసేయాలి. తరవాత వీటిమీద టొమోటో కెచప్‌ వేసి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ క్యాప్సికమ్ పిజ్జా సిద్ధమైనట్లే..! పిజ్జా బేస్‌ రెడీగా లేనప్పుడు పిల్లలు పిజ్జా కోసం మారాం చేస్తుంటే, ఇంట్లోనే ఉన్న బ్రెడ్‌తో ఇలా చేసిపెట్టవచ్చు.

వెబ్దునియా పై చదవండి