మకాయ కార్న్ నొ దన్నో

కావలసిన పదార్థాలు :
తాజా మొక్కజొన్న కంకులు... రెండు
పాలు... 150 మి.లీ
నెయ్యి... 15 మి.లీ
కరివేపాకు... ఒక కాడ
అల్లం... కొద్దిగా
పచ్చిమిర్చి... రెండు
పసుపు... చిటికెడు
కొత్తిమీర... అర కప్పు
ఉప్పు... తగినంత
జీలకర్ర... కొద్దిగా

తయారీ విధానం :
మొక్కజొన్న విత్తనాల్ని వేరు చేసి రుబ్బుకోవాలి. తరవాత పచ్చిమిర్చికి అల్లాన్ని చేర్చి ముద్దలా నూరాలి. బాణలిలో నెయ్యిని కరిగించి అందులో మొక్కజొన్న పేస్టును వేసి ఉడికించాలి. మొక్కజొన్న పూర్తిగా ఉడికిన తరవాత అందులో పసుపు, పాలు చేర్చాలి.

పాలు కాగి పూర్తిగా ఇంకిన తరవాత అల్లం ముద్దను కలిపి ఉడికించాలి. కొంచెం రంగు మారుతున్నట్లుగా అనిపించగానే దించాలి. ఇప్పుడు చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకులతో పోపు పెట్టి, ఉడికించి పక్కన ఉంచిన మిశ్రమంలో కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, వేడి వేడిగా వడ్డించాలి. అంతే మకాయ కార్న్ నొ దన్నో రెడీ అయినట్లే...!.

వెబ్దునియా పై చదవండి