కావలసిన పదార్థాలు : మష్రూం (పుట్టగొడుగులు)... 20 క్యారెట్లు... రెండు ఉప్పు... తగినంత నీరు... సరిపడా ఫ్రెంచి బీన్స్... నాలుగు ఉల్లి ముక్కలు... రెండు టీ. వెల్లుల్లి... ఒకటి క్యాబేజీ ఆకులు... నాలుగు కొత్తిమీర... అరకప్పు పంచదార... రెండు టీ. మొక్కజొన్న పిండి... ఆరు టీ. నిమ్మరసం... ఆరు టీ.
తయారీ విధానం : ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిగా మరిగించాలి. అందులో తరిగిన క్యారెట్, బీన్స్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ ఆకులు వేసి ఉడికించాలి. సగం కొత్తిమీర, పంచదార కూడా వేసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు కలిపిన మొక్కజొన్న పిండిని అందులో పోసి, రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి దించేయాలి.
చివర్లో నిమ్మరసం కలిపి, మిగిలిన కొత్తిమీర వేసి మూతపెట్టాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్స్‌లో పోసి... సన్నగా, పొడవుగా తరిగిన క్యారెట్‌తో అలంకరించి వేడి వేడిగా అతిథులకు సర్వ్ చేయాలి.