కావలసిన పదార్థాలు : పుట్టగొడుగులు... పావు కేజీ బంగాళాదుంపలు... పావు కేజీ ఉల్లిపాయలు... మూడు పచ్చిమిర్చి... ఐదు కొత్తిమీర... మూడు కట్టలు మిరియాలపొడి... అర టీ. ఉప్పు... తగినంత నిమ్మకాయ... ఒకటి కోడిగుడ్డు... ఒకటి బ్రెడ్ పొడి... వంద గ్రా. నూనె... వేయించేందుకు తగినంత
తయారీ విధానం : పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, నీళ్లలో మరిగించి సన్నని ముక్కలుగా కోయాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించాలి. అందులోనే ఉడికించిన బంగాళాదుంపల పొడి వేయాలి. ఆపై తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.
తరువాత పుట్టగొడుగుల్ని కూడా వేసి కలిపి వేయించి, దించి ఆరాక చిన్న వడల్లాగా చేయాలి. కోడిగుడ్డు సొనను గిలకొట్టి అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పుట్టగొడుగు వడల్ని ఈ సొనలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.