మెకరోని మిల్క్ స్పెషల్

కావలసిన పదార్థాలు :
మెకరోని... 400 గ్రా.
నెయ్యి... వంద గ్రా.
బెల్లం... 800 గ్రా.
పాలు... మూడు లీ.
కొబ్బరికాయలు... రెండు
యాలక్కాయలు... ఎనిమిది

తయారీ విధానం :
కొబ్బరిని తురుముకోవాలి. బెల్లం తురిమి లేత పాకం పట్టాలి. పొడవుగా ఉండే మెకరోని తీసుకుని, ఓ బాణలిలో నెయ్యి వేసి దోరగా వేయించాలి. అందులోనే పాలు పోసి ఉడికించాలి. మెకరోని మెత్తబడిన తరవాత దించాలి. కాస్త చల్లారిన తరవాత కొబ్బరితురుము, బెల్లం పాకం పోసి కలిపి యాలకులు పొడి వేస్తే మెకరోని మిల్క్ స్పెషల్ తయారైనట్లే..!

వెబ్దునియా పై చదవండి