కావలసిన పదార్థాలు : మైదాపిండి... ఒక కేజీ మామిడిపండు ముక్కలు... నాలుగు కప్పులు పంచదార... అర కేజీ కోడిగుడ్లు... నాలుగు బేకింగ్ పౌడర్... మూడు టీ. వెనిల్లా ఎసెన్స్... రెండు టీ. క్రీమ్... అలంకరణకు తగినంత
తయారీ విధానం : మైదాపిండిని నూనె లేకుండా రెండు నిమిషాలపాటు, పచ్చి వాసన పోయేంతదాకా వేయించాలి. కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, అందులో చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగిన తరువాత అందులో బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, మామిడిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. దాంట్లో మైదాపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో ఉంచి, మైక్రో ఓవెన్లో పెట్టి ఉడికించాలి. కేక్ ఉడికిన తరువాత ఓవెన్లోంచి తీసివేసి, పైన క్రీమ్తో అలంకరించి సర్వ్ చేయాలి.