మ్యాంగో ఎల్లో ఫ్లామెంకో

కావలసిన పదార్థాలు :
మామిడిపండు రసం... పావు లీ.
కుష్ సిరప్... ఐదు టీ.
నిమ్మరసం... రెండున్నర టీ.
సోడా... తగినంత

తయారీ విధానం :
ముందుగా పొడవాటి గ్లాసు ఒకటి తీసుకుని, పొడి చేసిన ఐస్‌ను అందులోని తీసుకోవాలి. దానిపై కుష్ సిరప్ వేసి, గ్లాసును కొద్దిగా కదుపుతూ మామిడి రసాన్ని గ్లాసు అంచుల వెంబడి పోస్తూ ఉండాలి.

ఇప్పుడు దానిపై నిమ్మరసాన్ని కూడా పై విధంగానే జోడించాలి. చివర్లో సోడా కలపాలి. సర్వింగ్ గ్లాసులో ఈ మిశ్రమాన్ని ఒంపి, మ్యాంగో బాల్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మ్యాంగో ఎల్లో ఫ్లామెంకో రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి