కావలసిన పదార్థాలు : మామిడిపండ్లు... ఐదు పాలు... ఒక కప్పు పంచదార... మూడు టీ. యాలక్కాయలపొడి... ఒక టీ. పుదీనా ఆకులు... కాసిన్ని మీగడ... ఒక కప్పు
తయారీ విధానం : మామిడిపండు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలను మరిగించి అందులో మీగడను మిక్సీలో మెత్తగా చేయగా వచ్చే క్రీమ్‌ను, పంచదార, యాలక్కాయలపొడి, మామిడిపండు ముక్కలు కలిపి కొన్ని నిమిషాలపాటు ఉడికించాలి. ఉడుకుతుండగానే మామిడిపండు ముక్కలను ఏదేని స్పూన్‌తో చిదమాలి. అలాగే మ్యాంగో ఫ్లేవర్ వచ్చేదాకా కొద్దిసేపు ఉడకనివ్వాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని... పుదీనా ఆకులతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో చల్లబరచాలి. చల్లబడిన తరువాత తీసి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మిల్క్ డెజర్ట్ రెడీ అయినట్లే...! సింపుల్‌గా తయారు చేయగలిగే ఈ పదార్థాన్ని మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ...!!