కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు... పావు కేజీ ఉల్లిపాయలు... 50 గ్రా. గుడ్లు... ఐదు మిరియాలపొడి, ఉప్పు... రుచికి సరిపడా నూనె... 20 గ్రా.
తయారీ విధానం : బంగాళాదుంపల తొక్క తీసి, నలుచదరంగా ఉండేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్ది నూనెలో సన్నటి సెగమీద పది నిమిషాలపాటు వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసుకుని ఐదారు నిమిషాల పాటు వేయించాలి.
ఒక పాత్రలో గుడ్లను గిలకొట్టి అందులో వేయించిన ఊలూ, ఉల్లిపాయ ముక్కలను, ఉప్పు, మిరియాలపొడిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ కడాయిలో మందంగా ఆమ్లెట్‌లాగా వేసి, రెండువైపులా సన్నని సెగపైన దోరగా వేయించాలి. తర్వాత కేకు ముక్కల్లాగా కట్ చేసి తాజా సలాడ్లతో కలిపి నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.