కూరలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడకుండా.. రెండు స్పూన్ల పాల మీగడ కలిపేయండి. ఉప్పదనం కాస్త పరారైపోతుంది. కూర కూడా టేస్టీగా తయారవుతుంది. పులిహోర చేసేటప్పుడు.. అన్నం విడివిడిగా రావాలంటే.. అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూన్ నూనె వేస్తే సరి.. అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా పొడిపొడిగా వస్తుంది.
బెండకాయ ముక్కల్ని శుభ్రం కడిగా బాణలిలో వేయించి ఆ తర్వాత ఉడకబెడితే.. జిగటగా వుండకుండా విడివిడిగా వుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు వచ్చే వాసనను తొలగించుకోవాలంటే.. చిన్న బ్రెడ్ ముక్క వేయాలి. లేదంటే ఓ స్పూన్ పంచదార వేయాలి. నెయ్యి కాచేటప్పుడు కాసిని మెంతులు లేదా ఓ తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం నిల్వ వుంటుంది.