గారెల పిండి అన్నానికి లింక్ ఏంటీ..?

శనివారం, 29 డిశెంబరు 2018 (18:07 IST)
నేటి తరుణంలో ఆరోగ్యంగా జీవించాలంటే పదార్థాలు శుభ్రంగా ఉంటేనే అది సాధ్యం. కాబట్టి ఈ చిట్కాలు పాటించాలంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
 
1. పప్పు ఉడికిన తరువాతనే ఉప్పు వేయండి. మొదటే వేస్తే ఉప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అరటిపూసలోని పీచు తీసేయాలంటే పూసను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచెం మజ్జిగ చిలకరిస్తే పీచు కవ్వంతో తేలికగా వస్తుంది.
 
2. ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందు వాటిని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే తరిగేటప్పుడు కళ్ళు మండవు. దోసకాయలు చేదుగా ఉంటే ఉప్పు నీళ్లల్లో ఉడకబెట్టండి. చేదు పోతుంది.
 
3. గారెల పిండి రుబ్బేటప్పుడు రెండు గరిటెల అన్నం వేసి మెత్తగా రుబ్బండి. ఈ పిండితో చేసిన గారెలు ఎంతో రుచిగా ఉండి, కరకరలాడుతుంటాయి. 
 
4. వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పు నూనె వేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచండి. ఒకటి రెండు వెల్లుల్లి రేకులు అవసరమైనప్పుడు పనిగట్టుకుని నూరకుండా ఈ నూనె ఒక చెంచా ఉపయోగిస్తే సరిపోతుంది. వంటకానికి రుచి, వాసనా వస్తాయి.
 
5. బెల్లపు పాకం గానీ, పంచదార పాకం గానీ పట్టేటప్పుడు త్వరగా ముదురు పాకానికి వస్తే రెండు స్పూన్ల పాలు పోసి కదపండి. పాకం లేతగా అవుతుంది. కుక్కర్ గాస్కెట్ ఉపయోగించిన వెంటనే ఐస్‌ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు మన్నుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు