కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిల్వవుంటాయి. అల్లం. పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి ఉప్పు వేసి నిల్వచేసుకోవచ్చు.
2. పప్పులు, ఉప్పులు వేసుకునే సీసాలు మురికిగా ఉన్నట్లైతే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలిపి ఆ తర్వాత నీటితో కడిగితే జిడ్డంతా తొలగిపోతుంది. అలానే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన కొన్ని బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటాయి.
4. పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. మంచి రుచితోపాటు బలవర్థకం కూడా. సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.