ఇకపోతే కొన్నిసార్లు తయారుచేసిన పదార్థాలు ఉప్పు ఎక్కువై ఉప్పగా వుంటాయి. అలాంటి పదార్థాలు వున్న పాత్రపై మూత తీసేసి, ఆ మూత స్థానంలో అరటి ఆకు వేసి పళ్లెంలా బోర్లించండి. అలాగే కొద్దిసేపు పొయ్యిమీద పెట్టి వేడి చేయండి. ఇలా చేస్తే ఆవిరి అలాగా ఆ పదార్థంలో వున్న ఉప్పును లాగేస్తుంది. అందువల్ల ఆ పదార్థంలో వున్న ఉప్పు తగ్గి రుచిగా తయారవుతుంది.