అలాంటి వాతావరణంలో గ్యాస్ సిలిండర్‌ను చాలా తక్కువగా వాడాలి. ఎలా ఆదా చేయాలనేది తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్‌లోని బర్నర్‌ను ఎప్పుడూ శుభ్రంగా, మురికి లేకుండా ఉంచాలి. ధూళి గ్యాస్‌ను అంటుకుంటే గ్యాస్ ఎక్కువగా వాడాల్సి వుంటుంది.
వంటపాత్రలను శుభ్రం చేశాక.. వాటిని తడిబట్టతో తుడిచిన తర్వాతే వాడాలి. అలాగే వండేటప్పుడు మూత పెట్టండి. కూరగాయలు వండాలన్నా, అన్నం వండాలన్నా మూత పెడితే త్వరగా ఆహారం ఉడుకుతుంది. కావాలంటే కుక్కర్‌ని కూడా ఉపయోగించవచ్చు.