వాడిపోయిన కాయగూరలు తాజాగా వుండాలంటే ఇలా చేయాలి

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (21:20 IST)
వాడిపోయినట్లుండే కాయగూరలను ఉపయోగించే ముందు వాటిని నిమ్మరసం కలిపిన నీటిలో గంటసేపు ఉంచి తరువాత వాడితే తాజాగా మారుతాయి.
 
ఫ్రిజ్ లేని వారు.. గుడ్ల పై పొరమీద ఆవాలనూనె గానీ, వనస్పతి నూనెగానీ పూస్తే.. గుడ్లు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
 
కాసిన్ని పాలతోటే టీ రెడీ చేసిన తరువాత, అందులో కాసింత బిస్కెట్ పొడిని వేసి బాగా కలిపండి. తక్కువ పాలతో ఎక్కువ చిక్కటి టీ రెడీ అయినట్లే.
 
ఉల్లిపాయకు పొట్టును తీసి... ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టిన తరువాత తిన్నట్లయితే నోరు వాసన రాకుండా ఉంటుంది.
 
ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒక చాక్లెట్ కూడా తినటం మరీ మంచిది. ముఖ్యంగా గర్భిణీలకు చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
కాకర కాయల్ని కాయలుగానే ఉంచితే త్వరగా పండిపోతాయి. అలా కాకుండా వాటిని ముక్కలుగా కోసి ఉంచుకుంటే త్వరగా పండవు.
 
అన్నం ఉడుకుతున్నప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ముందుగానే అన్నం వండే గిన్నె అంచు లోపలివైపు నూనె రాస్తే అలా పొంగదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు