పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?

మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:00 IST)
వంటిట్లో పూజగదిలో పసుపుతో చాలా అవసరమే ఉంటుంది. అయితే ఒక్కసారి వస్త్రాల మీద పడినపుడు మొండి మరకలుగా మారిపోతాయి. సబ్బుతో రుద్దినా కూడా మరకలు పోవు. అలాగే చేతులకు అంటినా త్వరగా వదలదు. అప్పుడేం చేయాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో వీటిని సులువుగా వదిలించుకోవచ్చు.
 
నీళ్లు బాగా మరిగించి అందులో కొద్దిగా గ్లిజరిన్, వంట సోడా కలిపి పసుపు మరకలు అంటిన దుస్తులను నానబెట్టాలి. మర్నాడు డిటర్జెంట్‌తో రుద్ది ఉతికితే అవి క్రమంగా వదిలిపోతాయి. అలానే మరక జిడ్డుగా ఉంటే మాత్రం నిమ్మకాయను గుజ్జుగా చేసి ఆ ప్రాంతంలో బాగా రుద్దాలి. అవి మాయమయ్యే వరకూ ఇలా చేస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు