కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్

ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (13:10 IST)
దేశంలోనే కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది. కొవిడ్‌-19 బారినపడిన వారిలో చిట్ట‌చివ‌రి ముగ్గురు కోలుకోవ‌డంతో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఆదివారం క‌రోనా వైర‌స్‌లేని రాష్ట్రంగా మారింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రం అరుణాచ‌ల్‌లో మొత్తం 16,836 కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వీరిలో 56 మంది చ‌నిపోగా మిగిలిన 16,780 మంది వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజా కొవిడ్ కేసులేవి న‌మోదు కాలేద‌న్నారు. 
 
ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 32,325 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డిమోంగ్ పాడుంగ్ తెలిపారు. ఆరోగ్య శాఖ వారానికి నాలుగు రోజులు - సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం టీకాల డ్రైవ్ నిర్వహిస్తోందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు